ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-06-21T07:01:57+05:30 IST

మండలంలోని వర్కట్‌పల్లి గ్రామంలో శ్రీసీతారా మచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు

ఘనంగా సీతారామచంద్రస్వామి కల్యాణం
వర్కట్‌పల్లిలో తాళిని చూపుతున్న అర్చకుడు

వలిగొండ, జూన్‌ 20: మండలంలోని వర్కట్‌పల్లి గ్రామంలో శ్రీసీతారా మచంద్రస్వామి ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆరుబయట పచ్చని మామిడి తోరణాలు కట్టి  మండపంలో సీతారామ చంద్రస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ముందు గా నిత్యవిధి హోమాలు, కళాన్యాస హోమం, విగ్రహాల ప్రతిష్ఠ,  ఆలయ మూలమూర్తులు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, సర్పంచ్‌ మీసాల శేఖర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురకంటి వెంకట్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, ఆలయ చైర్మన్‌ వార్డు సభ్యులు,  గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T07:01:57+05:30 IST