ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవ పూజలు
ABN , First Publish Date - 2021-10-21T06:15:20+05:30 IST
ఆలేరు పట్టణంలోని శిరిడీ సాయిబాబా ఆలయ 21వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కాగడ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి.
ఆలేరు, అక్టోబరు 20: ఆలేరు పట్టణంలోని శిరిడీ సాయిబాబా ఆలయ 21వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కాగడ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం సాయినాథుడికి 108 కళశాలతో అభిషేకం, అఖండ దీపారాధన, ప్రత్యేక అలం కరణ, అర్చన చేశారు. పూజల అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి కామిటికారి అశోక్, డైరెక్టర్ చింతకింది చంద్రకళ, పాల్గొన్నారు.