బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు

ABN , First Publish Date - 2021-10-14T05:53:33+05:30 IST

బతుకమ్మ పండుగను ప్రపంచానికి చాటిన మహానీయుడు సీఎం కేసీఆర్‌ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని పర్సాయపల్లి గ్రామంలో బతుకమ్మ విగ్రహాలను, బతుకమ్మ ఆట స్థలాన్ని బు

బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు
అర్వపల్లి: పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కిషోర్‌

అర్వపల్లి, అక్టోబరు 13: బతుకమ్మ పండుగను ప్రపంచానికి చాటిన మహానీయుడు సీఎం కేసీఆర్‌ అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని  పర్సాయపల్లి గ్రామంలో బతుకమ్మ విగ్రహాలను, బతుకమ్మ ఆట స్థలాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను కన్నుల పండువగా నిర్వహించుకుంటారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆడపడుచులకు పెద్దన్నలా వ్యవహరిస్తూ చీరలు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో దసరా పండుగను నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మినర్సయ్యయాదవ్‌, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంట్ల సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్‌గౌడ్‌, సర్పంచ్‌ పుప్పాల శేఖర్‌, ఎంపీటీసీ రాచకొండ గీతసురేష్‌, అంకిరెడ్డి లింగయ్య, ఎర్ర నర్సయ్య, యుగేందర్‌, ఉపేందర్‌, అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

సూర్యాపేట కల్చరల్‌: బతుకమ్మ పండుగగకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మాట్లాడారు. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఆడుకోవడానికి సరైన స్థలం లేక ఇక్కట్లు పడ్డ ప్రజలకు ప్రస్థుతం విశాలమైన స్థలంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేలా మంత్రి జగదీష్‌రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరిండెంట్‌ మురళీధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ చిరువెళ్ళ లక్ష్మికాంతమ్మ, అనంతుల యాదగిరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-14T05:53:33+05:30 IST