పింఛన పుస్తకం ఇప్పించండి
ABN , First Publish Date - 2021-11-21T06:32:59+05:30 IST
తన కుమారుడు అండెం పిచ్చిరెడ్డి తన పింఛన పుస్తకం, తనపై ఉన్న మూడు తులాల బంగారం లా క్కున్నాడని, వాటి ఇ ప్పించాలని దాచారం గ్రామానికి చెందిన అం డెం అనసూయమ్మ వేడుకుంది.

మోత్కూరు, నవంబరు 20: తన కుమారుడు అండెం పిచ్చిరెడ్డి తన పింఛన పుస్తకం, తనపై ఉన్న మూడు తులాల బంగారం లా క్కున్నాడని, వాటి ఇ ప్పించాలని దాచారం గ్రామానికి చెందిన అం డెం అనసూయమ్మ వేడుకుంది. శనివారం మోత్కూరులో ఆమె తన కు మార్తెలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు తనను బా గా చూసుకోకపోవడంతో తన కూతుళ్ల వద్ద ఉంటున్నానని తెలిపింది. కొ న్ని నెలలుగా తన పింఛన తన కుమారుడే తీసుకుంటున్నాడని ఆరోపించింది. ఇప్పటికైనా తన పింఛన పుస్తకం, బంగారం ఇప్పించాలని కోరింది. ఈ విషయమై ఈ నెల 17న ఎస్‌ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ను వివరణ కోర గా అండెం పిచ్చిరెడ్డిని పోలీ్‌సస్టేషనకు రమ్మని పిలువగా అతనికి జ్వరం వచ్చిందని రాలేదన్నారు. పిలిపించి విచారిస్తామన్నారు.