ఘనంగా కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-12-26T05:48:54+05:30 IST

రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో నాయ కులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శాలువా కప్పి, జన్మదిన కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి-పద్మ దంపతులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనర్సిం హస్వామి ఆలయం

ఘనంగా కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు
దత్తప్పగూడెంలో కేక్‌ కట్‌ చేస్తున్న రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి

మోత్కూరు, డిసెంబరు 25: రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో నాయ కులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. శాలువా కప్పి, జన్మదిన కేక్‌ కట్‌ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి-పద్మ దంపతులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనర్సిం హస్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్క నాటారు. సింగిల్‌ విండో చైర్మన్‌ కంచర్ల అశోక్‌రెడ్డి సహకారంతో మోత్కూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో అయ్య ప్ప భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్‌ చైర్మన్‌ కొణ తం యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌, కొండ సోంమల్లు, సర్పంచ్‌ ఎలుగు శోభసోమయ్య, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, సాజిద్‌పాషా, పానుగుళ్ల విష్ణుమూర్తి, గజ్జి మల్లేష్‌, జంగ శ్రీనివాస్‌, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ఎలుగు యాదయ్య, ఎలుగు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T05:48:54+05:30 IST