లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-05-09T04:53:35+05:30 IST

కొవిడ్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తేనే కరోనా రాపిడ్‌ పరీక్ష చేయించుకోవాలని మోత్కూరు పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌ ఆకవరం చైతన్యకుమార్‌ అన్నారు.

లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలి
బీబీనగర్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది

మోత్కూరు, మే 8: కొవిడ్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తేనే కరోనా రాపిడ్‌ పరీక్ష చేయించుకోవాలని మోత్కూరు పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌ ఆకవరం చైతన్యకుమార్‌ అన్నారు. శనివారం మోత్కూరు మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి ఆయన కొవిడ్‌ లక్షణాలు, సర్వేపై అవగాహన కల్పించి మాట్లాడారు. నాలుగు రోజులకు పైగా జ్వరం ఉన్నా, తలనొప్పి, జలుబు, గొంతునొప్పిలాంటివి ఉన్నట్లయితే కరోనా రాపిడ్‌ టెస్టు చేయించుకోవాలని, మాములుగా వచ్చే జ్వరం, జలుబుకు ట్యాబ్‌లెట్సు వాడితే తగ్గిపోతాయన్నారు. ఇంటింటి సర్వేకు వచ్చే సిబ్బందికి వాస్తవాలు వెల్లడించి సహకరించాలన్నారు. మండలంలోని పొడిచేడు గ్రామంలో సర్పంచ పేలపూడి మధు ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కార్యక్రమంలో రవి, భాస్కర్‌, అంజి, మల్లేష్‌ పాల్గొన్నారు.

బీబీనగర్‌: కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే చివరి దశకు చేరింది. మండలంలో మొత్తం 34 గ్రామ పంచాయతీలలో మొత్తం 12వేల ఇళ్లను సర్వే చేయాల్సి ఉండగా 60 సర్వే టీంలు గడిచిన 3 రోజుల్లో 11వేల ఇళ్ల సర్వే పూర్తి చేసి 500 మందికి పైగా వివిధ అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించారు. వారికి మందులు అందజేసి సలహాలు సూచనలు అందజేశారు. అలాగే 45 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు. వారిలో కొవిడ్‌ టీకా ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నవారు ఎంతమంది, మొత్తానికి టీకా వేసుకోని వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను సర్వేలో పొందుపరిచారు. ఇదిలాఉంటే మండలంలోని వెల్డ్‌ఫ్యూర్‌, జై బాలాజీబేకర్‌ బిస్కేట్‌ కంపెనీతో పాటు సికింద్రాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ 33 చారిటి సంస్థ, సర్జికల్‌ మాస్కు, ఫేస్‌షీల్డ్‌, హెడ్‌ కవర్లు హైండ్‌ గ్లౌజె్‌సను సర్వే సిబ్బందికి ఎంపీపీ అందజేశారు. 

వలిగొండ/గుండాల: మండల పీహెచసీలలో శనివారం 87మందికి రాపిడ్‌ టెస్టులు చేయగా, 34 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైనట్లు మండల వైద్యాధికారి సుమన కల్యాణ్‌ తెలిపారు. గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 52మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు.


కూరగాయల పంపిణీ 

వలిగొండ మండలం అర్రూరు గ్రామంలో బీజేపీ మండల కార్యదర్శి ఎలిమినేటి వెంకటేశం సౌజన్యంతో కరోనా రోగులకు కూరగాయలు పంపిణీచేశారు. కరోనా వైరస్‌ బారిన పడి హోం క్వారంటైనలో ఉండి ప్రజా శ్రేయస్సు కోసం కూరగాయల పంపిణీకి సహకరించిన దాత వెంకటేశంను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివా్‌సరెడ్డి, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-09T04:53:35+05:30 IST