యాదాద్రిలో కల్యాణ మూర్తుల గరుడవాహన సేవ

ABN , First Publish Date - 2021-03-24T06:52:33+05:30 IST

విశ్వ కల్యాణమే పరమార్థంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవ తిరుకల్యాణమూర్తులను మంగళవారం వెండిగరుడ సేవలో భక్తజనులు దివ్యదర్శనం చేసుకున్నారు.

యాదాద్రిలో కల్యాణ మూర్తుల గరుడవాహన సేవ
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

రాత్రి ఉత్సవమూర్తుల రథాంగ దర్శనం

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి/ యాదాద్రిటౌన్‌): విశ్వ కల్యాణమే పరమార్థంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవ తిరుకల్యాణమూర్తులను మంగళవారం వెండిగరుడ సేవలో భక్తజనులు దివ్యదర్శనం చేసుకున్నారు.పట్టువస్ర్తాలు,ముత్యాల, బంగారు, వజ్రాభరణాలతో దివ్యమనోహరమైన అలంకారమూర్తినారింహుడిని తన ఇష్టవాహనమైన గరుత్మంతుడి పై అధిష్ఠింపజేశారు. అనంతరం దేవేరి శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమేతంగా బాలాలయంలో ఊరేగా రు.యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యులు,ప్రధాన అర్చకులు నల్లంథిఘల్‌ లక్ష్మీనరసింహాచార్యులు,కారంపూడి నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో పూజాకార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, సిబ్బంది,చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ బుద్ధ మురళీ పాల్గొన్నారు.

ఘనంగా దివ్య విమాన రఽథోత్సవం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహులు భక్తజనులకు రఽథరూపులుగా దర్శనమిచ్చారు. లోక కల్యాణంకోసం నిర్వహిస్తున్న  బ్రహ్మోత్సవాల్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో దివ్యవిమాన రథోత్సవాన్ని ఆగమనియమాలకు అనుగుణంగా బాలాలయ ఉత్సవ మండపంలో నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన రథానికి దిష్టికుంభం తీశారు. పట్టువస్త్రా లు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన నూతన కల్యాణ దంపతులైన లక్ష్మీ, నారసింహులను బాలాలయ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై అధిష్ఠించారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు రథాంగహోమం నిర్వహించారు. అదే విధంగా వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి ఆకుల తోరణలతో స్వామివారి దివ్య విమానరథాన్ని అలంకరించి, పట్టణ పురవీధుల్లో ఊరే గించారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు చక్రతీర్థం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం బాలాలయంలో స్వామివారి చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు. కొండపైన ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా ఆగమ శాస్త్రానుసారం పుష్కరిణి లో కాకుండా బాలాలయంలోనే శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం దోపు, శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన పర్వాలు బాలాలయంలోనే కొనసాగనున్నాయి. 

Updated Date - 2021-03-24T06:52:33+05:30 IST