గరంగరంగా కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-10-29T06:47:16+05:30 IST

పట్టణ ప్రగతి బిల్లుల చెల్లింపులు, రో డ్డు విస్తరణ కోసం భవనాలు, డబ్బా దుకాణాల తొలగింపు అంశాల రగడతో గురువారం జరిగిన భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం గరంగరంగా మారింది.

గరంగరంగా కౌన్సిల్‌ సమావేశం
భువనగిరి కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న చెర్మన ఆంజనేయులు

భువనగిరిటౌన, అక్టోబరు 28: పట్టణ ప్రగతి బిల్లుల చెల్లింపులు, రో డ్డు విస్తరణ కోసం భవనాలు, డబ్బా దుకాణాల తొలగింపు అంశాల రగడతో గురువారం జరిగిన భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం గరంగరంగా మారింది.  చెర్మన ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన స మావేశం ప్రారంభమైన వెంటనే కాగ్రెస్‌ సభ్యుడు ఈరపాక నర్సింహ, బీజేపీ సభ్యుడు రత్నపురం బలరాం మాట్లాడుతూ మూడవ విడత పట్టణ ప్రగతిలో అక్రమాలు జరిగాయని, పారిశుధ్య పనుల పేరిట ఎక్స్‌కవేటర్‌, డోజర్లు, ట్రాక్టర్లకు ఏకంగా రూ. 28.50 లక్షల బిల్లుల చెల్లింపుల్లో అవినీతి కోణం ఉం దని ఆరోపిస్తూ ఆ అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. అంతే కాక వారు సుమారు గంట పాటు అధికారులను, చెర్మనను నిలదీయండంతో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రతివాదనలకు దిగడంతో ఇరువర్గాల కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినా బిల్లుల ఎజెండా అంశం ఆమోదం పొం దడం గమనార్హం. పట్టణ ప్రధాన రహదారి విస్తరణ, కోతులు, కుక్కలు, పం దుల నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. చెర్మన ఆంజనేయులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు పట్టణ అభివృద్ధి పనులకు వినియోగంచుకోవాలని, అర్బన కాలనీ, బస్తీలకు  శాశ్వత రహదారి నిమిత్తం హెచఎండీఏ మాస్టర్‌ ప్లాన ప్ర కారం అవసరం మేరకు స్థల సేకరణకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అలాగే పలు అంశాలపై పలువురు సభ్యులు మాట్లాడారు. వైస్‌చెర్మన చింతల కిష్ట య్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:47:16+05:30 IST