రానున్న రోజుల్లో నీలగిరి మరింత అభివృద్ధి

ABN , First Publish Date - 2021-12-31T06:32:04+05:30 IST

రానున్న రోజుల్లో నల్లగొండ మునిసిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని మునిసిపల్‌ చైర్మన మందడి సె ౖదిరెడ్డి అన్నారు.

రానున్న రోజుల్లో నీలగిరి మరింత అభివృద్ధి
నల్లగొండ మునిసిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సైదిరెడ్డి

 రానున్న రోజుల్లో నీలగిరి మరింత అభివృద్ధి 

మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి 

రామగిరి, డిసెంబరు 30: రానున్న రోజుల్లో నల్లగొండ మునిసిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని మునిసిపల్‌ చైర్మన మందడి సె ౖదిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో జరిగిన మునిసిపల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో పట్టణాభివృద్ధికి వరాల జల్లు కురిపించారని పేర్కొన్నారు. గ తంలో రూ.150కోట్లు ప్రకటించగా తాజా పర్యటనలో మరో రూ.150 కో ట్లు కేటాయించడం అభినందనీయమని అన్నారు. దీంతో నల్లగొండ పట్ట ణం సర్వాంగ సుందరంగా మారనుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ కాల్వలు, సమీకృత మార్కెట్ల నిర్మాణానికి నిధులు రానున్నట్లు తెలిపారు. పట్టణంలో అతిపెద్ద పార్కు కూడా ఏర్పాటు చే యనున్నట్లు పేర్కొన్నారు. పట్టణాభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు సహకరించిన మంత్రి జగదీ్‌షరెడ్డికి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ పట్టణం అభివృద్ధి కాకపోవడానికి అధికారులే కా రణమని ఆరోపించారు. ట్రేడ్‌ లైసెన్సల గురించి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ అడిగిన వివరాలు అధికారుల వద్ద లేకపోవడం సిగ్గుచేటని అన్నా రు. పద్మానగర్‌ దగ్గర డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.15 లక్షలు కేటాయిస్తే 8 వార్డులకు సంబంధించిన సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌ అభిమన్యు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రకాశంబజార్‌లో గల మునిసిపల్‌ మడిగల అద్దె తక్షణమే వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ బండారు ప్రసాద్‌ మాట్లాడు తూ అద్దె బకాయిలు, ఆస్తి పన్ను వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని కో రారు. వైస్‌చైర్మన అబ్బగోని రమేష్‌ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ఎమ్మె ల్యే ప్రత్యేక చొరవ తీసుకోవడమే కాకుండా నిధుల మంజూరు చేయిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు త్రివిధ దళాల అధిపతి బిపిన రావత, మాజీ సీఎం రోశయ్య, మాజీ మంత్రి ఫరీదుద్దీన, మాజీ కౌన్సిలర్‌ చిలుకల గోవర్థన మృతి పట్ల 2 నిమిషాల మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. అనంతరం ఎజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్మన ప్రకటించారు. కార్యక్రమంలో ఇనచార్జి కమిషనర్‌ అశోక్‌, ఏసీపీ నాగిరెడ్డి, డీఈ నర్సింహారెడ్డి, శానిటరీ ఇనస్పెక్టర్లు మూర్తూజా, శంకర్‌, ఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T06:32:04+05:30 IST