నలుగురు గంజాయి విక్రేతల అరెస్టు
ABN , First Publish Date - 2021-09-03T06:25:06+05:30 IST
గంజాయి విక్రయిస్తున్న నలుగురిని నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్టుచేశారు.

నల్లగొండ క్రైం, సెప్టెంబరు 2 : గంజాయి విక్రయిస్తున్న నలుగురిని నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్టుచేశారు. నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతా నికి చెందిన శ్రీకాంత్, హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చెందిన అజీజ్ హైమద్‌లు స్థానిక రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించడంతో అదు పులోకి తీసుకొని విచారించామన్నారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గం జాయి స్వాధీనం చేసుకున్నామని; అదేవిధంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టణంలోని హైదరాబాద్ రోడ్డుకు చెందిన గుత్త కృష్ణ, గాంధీనగర్‌కు చెందిన చిలుకరాజు వెంకటేశ్వర్లు కూడా అనుమా నాస్పదంగా కనిపించారన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించడంతో వారి వద్ద కూడా 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.