వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ABN , First Publish Date - 2021-03-22T05:14:02+05:30 IST

వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా ఫారెస్టు అధికారి ముకుందరెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు.

వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
సూర్యాపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది

సూర్యాపేటటౌన్‌ / పాలకవీడు, మార్చి 21 : వన సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా ఫారెస్టు అధికారి ముకుందరెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఫారెస్టు రెంజ్‌ ఆఫీసర్లు హఫీజ్‌ఖాన్‌, లక్ష్మిపతిరావు, శ్రావణ్‌కుమార్‌, ఎఫ్‌ఎ్‌సవోలు, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు. పాలకవీడు మండలంలోని భవానీపూరంలోని డెక్కన్‌ సిమెంట్‌ కర్మాగారంలో అంతర్జాతియ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులు కలిసి చెట్లు నాటారు. కార్యక్రమంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరాజు, జీఎంలు రాఘవేంద్రరావు, నాగమళ్లేశ్వరావు, మస్తాన్‌, డీజీఎం కళ్యాణ్‌ చక్రవర్తి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-22T05:14:02+05:30 IST