రైలు కిందపడి యువకుడి బలవన్మరణం

ABN , First Publish Date - 2021-12-07T06:36:23+05:30 IST

రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భువనగిరి శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే క్రాసింగ్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది.

రైలు కిందపడి యువకుడి బలవన్మరణం
భగతశేఖర్‌ (ఫైల్‌)

భువనగిరిరూరల్‌, డిసెంబరు 6: రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భువనగిరి శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే క్రాసింగ్‌ వద్ద సోమవారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..... భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, భువనగిరి పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు చుంచు నాగభూషణం పెద్ద కుమారుడు చుంచు భగతశేఖర్‌ (32) భువనగిరి శివారులోని ముత్తిరెడ్డిగూడెం రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు ఈ విషయం రైల్వే పోలీసులకు సమాచారం అందజేయడంతో సెల్‌ఫోన ఆధారంగా మృతుడిని గుర్తించారు. మృతదేహం బాగా ఛిద్రమైంది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు భగతశేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2021-12-07T06:36:23+05:30 IST