నూతన టెక్నాలజీతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

ABN , First Publish Date - 2021-06-17T05:57:12+05:30 IST

అధునాతన, నూతన టెక్నాలజీతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మిస్తున్నటటునన్ల ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చెప్పారు.

నూతన టెక్నాలజీతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌
మిల్లర్స్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు

మిర్యాలగూడ, జూన 16 : అధునాతన, నూతన టెక్నాలజీతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మిస్తున్నటటునన్ల ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు చెప్పారు. బుధవారం ఆయన రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన బిల్డింగ్‌లో మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నియోజకవర్గ పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసిందన్నారు. దామరచర్ల మండల పరిధిలో బొత్తలపాలెం, నర్సాపురం ప్రాంతాల్లో 826, 95 సర్వే నెంబర్లలో భూమి యూనిట్‌ ఏర్పాటుకు పరిశీలిస్తున్నారన్నారు. జిల్లాలోనే అత్యధిక రైస్‌మిల్లులు కలిగిన మిర్యాలగూడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూని ట్‌ నిర్మాణంతో  మరింత వేగంగా  పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇప్పటి వరకు సెజ్‌లో ఇండసి్ట్రయల్స్‌ను ఏర్పాటుకు ఔత్సాహికుల నుంచి 196దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మరింత మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో మిల్లర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు కర్నాటి రమే ష్‌, ఉపాధ్యక్షులు రేపాల మధుసూదన, కార్యదర్శి కుశలయ్య, రశ్రీకర్‌, కోశాధికారి అంతయ్య, మిల్లర్స్‌, శ్రీనివాసనగర్‌ సర్పంచ వెంకట రమణచౌదరి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:57:12+05:30 IST