సమస్యలపై దృష్టి సారించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-06T05:23:26+05:30 IST

తహసీల్దార్లు ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

సమస్యలపై దృష్టి సారించాలి: కలెక్టర్‌

జిల్లాలో ఖాళీగా ఉన్న తహసీల్దార్‌ పోస్టుల భర్తీ

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 5 : తహసీల్దార్లు ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల తహసీల్దార్లుగా పదోన్నతి పొంది వివిధ జిల్లాల నుంచి సూర్యాపేట జిల్లాకు వచ్చిన వారికి శుక్రవారం పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు. చివ్వెంలకు రంగారావు, మద్దిరాలకు ఎంఏ.మన్నన్‌, నాగారానికి కామాద్రి, అర్వపల్లికి చంద్రశేఖర్‌రెడ్డి, నేరేడుచర్లకు వి.సరిత, పాలకీడుకు జి.రవికిరణ్‌కుమార్‌, మఠంపల్లికి వి.లక్ష్మణ్‌బాబు, చింతలపాలెం, నడిగూడెం మండలాలకు ఎం.కృష్ణమోహన్‌, ఎన్‌.ఆనంద్‌బాబు, అనంతగిరికి పి.విజయలక్ష్మి, చిలుకూరుకు రాజేశ్వరీ, తుంగతుర్తికి రాంప్రసాద్‌, మునగాలకు జి.కృష్ణలను నియమించారు. అదేవిధంగా ఇప్పటి వరకు కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న నాయబ్‌తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు తహసీల్దార్‌గా పదోన్నతి  లభించడంతో ఆయనకు కలెక్టరేట్‌లోనే పర్యవేక్షకుడిగా పోస్టింగ్‌ ఇచ్చారు.

Updated Date - 2021-02-06T05:23:26+05:30 IST