తొలిరోజు.. స్వల్ప హాజరు

ABN , First Publish Date - 2021-09-02T06:37:32+05:30 IST

కరోనా ప్రభావంతో సుమారు రెండేళ్లఅనంతరం ప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థులు బుధవారం స్వల్పంగా హాజరయ్యారు.

తొలిరోజు.. స్వల్ప హాజరు
రాయరావుపేట పాఠశాల సుందరీకరణ పనులను కమిషనర్‌కు వివరిస్తున్న ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌

 జిల్లావ్యాప్తంగా మోగిన బడిగంట
 మామిడి తోరణాలు, ముగ్గులతో స్వాగతం
 పాఠశాలలను పరిశీలించిన అధికారులు

భువనగిరి టౌన / గుండాల / యాదాద్రి రూరల్‌ /  ఆత్మకూరు(ఎం) /  మోత్కూరు / బీబీనగర్‌ / భువనగిరి రూరల్‌ / చౌటుప్పల్‌ టౌన, చౌటుప్పల్‌ రూరల్‌ / ఆలేరు, సెప్టెంబరు 1 :
కరోనా ప్రభావంతో సుమారు రెండేళ్లఅనంతరం ప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థులు బుధవారం స్వల్పంగా హాజరయ్యారు. కాగా పలు పాఠశాలల నిర్వాహకులు మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించారు. ఇంటర్‌ ఆపై స్థాయి కళాశాలలో,్ల ప్రైవేట్‌ పాఠశాలల్లో సైతం ఇదే తరహాలో హాజరు నమోదైంది. బీబినగర్‌ మండలంలోని జమీలాపేట, రాయరావుపేట, పడమటి సోమారం గ్రామాల్లోని యూపీఎస్‌, ఉన్నత పాఠశాలలను విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలను నిర్వహించాలన్నారు. ఆమె వెంట డీఈవో చైతన్యజైనీ, ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌, ఎంఈవో నాగవర్ధనరెడ్డి ఉన్నారు. భువనగిరి పట్టణంలోని రాయగిరి జడ్పీహెచలో మునిసిపల్‌ చెర్మన ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చెర్మన చింతల కిష్టయ్య పువ్వులతో విద్యార్ధులకు స్వాగతం పలికి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. గుండాల మండలంలో 2381మంది విద్యార్థులకు 610మంది హాజరయ్యారు. కొమ్మాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 28మంది విద్యార్థులకు 21మంది హాజరవగా, వస్తాకొండూరు ఉన్నతపాఠశాలలో 35మంది విద్యార్థులకు గాను ఇద్దరు హాజరైనట్లు ఎంఈవో శ్రీధర్‌ తెలిపారు. మండలంలోని సీతారాంపురం, మాసానపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలలు, అంగనవాడీ కేంద్రాలను ఎంపీవో జనార్దనరెడ్డి పరిశీలించారు. యాదగిరిగుట్ట పట్టణ, మండలంలోని ఆయా గ్రామాల్లో మొత్తం 57పాఠశాలలు బుధవారం తెరుచుకున్నాయి. మండలవ్యాప్తంగా 5586 మంది విద్యార్థులు ఉండగా 1422మం ది(38శాతం) మాత్రమే హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించారు. మండలంలోని వంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు. ఆత్మకూర్‌(ఎం),  మోత్కూరు, అడ్డగూడూరు, భువనగిరి, చౌటుప్పల్‌, ఆలేరు మండలాల్లో సైతం విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు.

Updated Date - 2021-09-02T06:37:32+05:30 IST