షార్ట్‌సర్క్యూట్‌తో కారులో మంటలు
ABN , First Publish Date - 2021-07-24T06:19:34+05:30 IST
మండల కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్ని ప్రమాదానికి గురైంది.
మునగాల, జూలై 23: మండల కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్‌తో కారు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మునగాల మండలం కలకోవ గ్రామా నికి చెందిన మండవ సైదులు శుక్రవారం తన సొంత కారులో మునగాల నుంచి కో దాడ వెళ్తుండగా, ఆయిల్ పైపు లీకై అకస్మాత్తుగా మంటలు అందుకున్నా యి. సైదు లు చాకచక్యంతో బండిని ఆపి బయటికి దూకటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కోదాడ అగ్నిమాపక సిబ్బంది ఏఎ్‌సఐ ఎల్లయ్య ఆధ్వర్యంలో మంటలు ఆర్పారు. ఈ ఘటనలో కారు ముందుభాగం పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది కోటేశ్వరరావు, రమే్‌షబాబు, వీరబాబు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.