కురుమ సంఘ భవనంలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-11-23T06:27:51+05:30 IST

పట్టణంలోని కురుమ సంఘం భవనంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్య్కూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది.

కురుమ సంఘ భవనంలో అగ్ని ప్రమాదం
దగ్ధమైన సామగ్రి

యాదాద్రిరూరల్‌, నవంబరు 22: పట్టణంలోని కురుమ సంఘం భవనంలో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్య్కూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కురుమ సంఘం భవ న సమీపంలోని విద్యుత్‌ ట్రాన్సఫార్మర్‌ వద్ద తీగలపై కోతులు పడ్డాయి. దీంతో టాన్స్‌ఫార్మర్‌ వద్ద షార్ట్‌సర్క్యూట్‌ జరిగి కరుమ సంఘం భవనం లో మంటలు వచ్చాయి. దీంతో రెండు గదుల్లో ఉన్న పర్నీచర్‌, వస్తు సా మగ్రి, పరుపులు అన్ని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసి మి గతా గదుల్లోకి మంటలు వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకున్నారు. కాలిపోయిన వస్తు సామగ్రి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని సంఘ నాయకులు తెలిపారు.  


Updated Date - 2021-11-23T06:27:51+05:30 IST