సమస్యలపై సమరశీల పోరాటాలు

ABN , First Publish Date - 2021-12-07T06:17:19+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం సమరశీల పోరాటాలు సాగిస్తోందని, ఢిల్లీలో రైతు ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

సమస్యలపై సమరశీల పోరాటాలు
అమరుల స్తూపం వద్ధ నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు, సభలో మాట్లాడుతున్న తమ్మినేని

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం


భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 6: ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం సమరశీల పోరాటాలు సాగిస్తోందని, ఢిల్లీలో రైతు ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భూదాన్‌పోచంపల్లి సోమవా రం ఏర్పాటుచేసిన సీపీఎం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ సంస్థల కు రాచబాట వేయాలన్న ప్రధాని మోదీ కుట్రపై రైతులు 24 నెలలు పోరాడి విజయం సాధించారన్నారు. కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసేలా లేబర్‌కోడ్‌ మార్చేందుకు పాలకులు చూస్తున్నారని, దానిపై సీపీఎం సంఘటిత పోరాటాలు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తొలుత సీపీ ఎం పతాకాన్ని ఆవిష్కరించి అమరులస్తూపం వద్ద నివాలళులర్పించారు. ఈ మహాసభ కు జిల్లా వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నాయకులు గూడూరు అంజిరెడ్డి, ఆశ య్య, కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, మేక అశోక్‌రెడ్డి, బట్టుపల్లి అనురాధ, మంగ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T06:17:19+05:30 IST