ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T06:22:58+05:30 IST

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్యయాదవ్‌ డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి
సూర్యాపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

 బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లింగయ్యయాదవ్‌ 

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 30: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్యయాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించి జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు బడ్జెట్‌ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్లుగా 12లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో వారు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ.4కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలను వెంటనే విడుదల చేయాలన్నారు. అదేవిధంగా పెరిగిన ధరలకనుగుణంగా రూ.5500 నుంచి రూ.20వేలకు స్కాలర్‌షి్‌పను పెంచాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థిసంఘం నాయకులు గుండా సందీప్‌, భారీ అశోక్‌, వెంకటే్‌షనాయక్‌, తగుళ్ల జనార్ధన్‌, బంటు సందీప్‌, అశోక్‌, వాసు, తరుణ్‌, మహేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T06:22:58+05:30 IST