ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-12-07T06:46:03+05:30 IST

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన కిరణ్‌ డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి
సూర్యాపేటలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

సూర్యాపేట కల్చరల్‌, డిసెంబరు 6:  పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌ విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన కిరణ్‌ డిమాండ్‌ చేశారు. సూర్యాపేటలోని  60 ఫీట్ల రోడ్డు నుంచి వాణిజ్య భవన్‌ సెంటర్‌ మీదుగా కొత్త బస్‌స్టేషన్‌ వరకు సోమవారం  నిరసన ర్యాలీ నిర్వహించి ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లాకు వ్యవసాయ కళాశాలను, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ. 3950 కోట్ల ఫీజ్‌రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లు విడుదల కాక పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందడి శ్రీధర్‌, దండి ప్రవీణ్‌, వంశీ, అనిల్‌, సందీప్‌, రవికిషోర్‌, శ్రవణ్‌, మహిపాల్‌, సంజయ్‌, ఆకాష్‌, శివ, సుశాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:46:03+05:30 IST