ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిలను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-12-31T06:18:42+05:30 IST
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
భువనగిరి రూరల్, డిసెంబరు 30: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను గురువారం ముట్టడించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు బకాయిలు ఉండడంతో పీజీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో, ఉద్యోగాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రధాన గేట్‌ను నెట్టుకుని కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు లోపలికి వెళ్తుండడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళన కారులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కాగా పోలీసులు ఆందోళన కారులను బుజ్జగించడంతో కలెక్టరేట్ కార్యాలయ ఏవో ఎంనాగేశ్వరచారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నీలం వెంకటేశ, చిన్నం రవికుమార్, పాక రమేశ యాదశ, మహేశ యాదవ్, శేఖర్ యాదవ్, రత్నపురం శ్యాం, పరమేశ, నాగరాజు తదితరులున్నారు.
మోత్కూరు : పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ, బీసీ రిజర్వేషన సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మోత్కూరులో బీసీ విద్యార్థి, యువజన, బీఆర్‌ఎ్‌సఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. అనంతరం తహసీల్దార్ షేక్ అహమ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సూదగాని పాండు, ఎన.మత్స్యగిరి, కె.రాజశేఖర్, నరేష్, రాజు, లక్ష్మణ్, శ్రవణ్ పాల్గొన్నారు.