ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదు: జేడీఏ

ABN , First Publish Date - 2021-12-08T06:18:49+05:30 IST

: యాసంగిలో వరి పంటను ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌ అన్నారు.

ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదు: జేడీఏ
రామోజీతండాలో రైతులతో మాట్లాడుతున్న జేడీఏ రామారావునాయక్‌,

ఆత్మకూర్‌(ఎస్‌) / చివ్వెంల / మద్దిరాల / మఠం పల్లి / నడిగూడెం / కోదాడ రూరల్‌ / నూతనకల్‌ / అర్వపల్లి, డిసెంబరు 7 : యాసంగిలో వరి పంటను ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌ అన్నారు. మండలంలోని రామోజీతండా, పాతర్లపహాడ్‌, కందగట్ల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు నిర్వహిం చిన వరి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు సదస్సులో ఆయన మాట్లాడారు. ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసర, శనగలు, మినుములు, కందులు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో కృష్ణసందీప్‌, ఏఈవోలు శైలజ, సహస్‌, శివ పాల్గొన్నారు. అదేవిధంగా చివ్వెంల, మద్దిరాల, మఠంపల్లి, నడిగూడెం, కోదాడ, అర్వపల్లి మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.  నూతనకల్‌ మండలం లింగంపల్లిలో జేడీఏ జగ్గూనాయక్‌ మాట్లాడుతూ ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు.  

Updated Date - 2021-12-08T06:18:49+05:30 IST