మార్కెట్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-06T05:26:39+05:30 IST

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందులు, వేరశనగ పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు లభిస్తున్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత అన్నారు. మార్కెట్‌లో కందులు, వేరుశనగ రాశులను ఆమె శుక్రవారం పరిశీలించారు.

మార్కెట్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మార్కెట్‌లో కందులను పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత

సూర్యాపేట సిటీ, ఫిబ్రవరి 5 : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందులు, వేరశనగ పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు లభిస్తున్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత అన్నారు. మార్కెట్‌లో కందులు, వేరుశనగ రాశులను ఆమె శుక్రవారం పరిశీలించారు. కంది పంటకు మద్దతు ధర ఒక క్వింటాకు రూ.6,000లు ఉండగా అధికంగా రూ.762లకు ఖరీదుదారులు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా వేరుశనగ పంటకు కూడా మంచి ధర లభిస్తుందన్నారు. వేరుశనగ క్వింటాకు మద్దతు రూ.5,275లు ఉండగా రూ.6,006 లభిస్తుందన్నారు. జనవరి 2వ తేది నుంచి నేటి వరకు మార్కెట్‌లో 1,768 క్వింటాళ్ల కందులు, 929 క్వింటాళ్ల వేరుశనగ కొనగోళ్లు జరిగాయని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నాగేశ్వర్‌రావు, గ్రేడ్‌-2 కార్యదర్శి షంషీర్‌, సహాయ కార్యదర్శి పుష్పలత, సూపర్‌వైజర్లు సుధీర్‌, శ్రవణ్‌కుమార్‌, సమీఉద్దీన్‌,  మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T05:26:39+05:30 IST