రైతుల పక్షపాతి వైఎస్‌ రాజశేఖరరెడ్డి

ABN , First Publish Date - 2021-09-03T07:06:14+05:30 IST

రైతుల పక్షపాతి దివం గత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ వర్ధంతిని గురువారం నిర్వ హించారు.

రైతుల పక్షపాతి వైఎస్‌ రాజశేఖరరెడ్డి
అనంతగిరిలో వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కనగాల వీరయ్య

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌,  సెప్టెంబరు 2 : రైతుల పక్షపాతి దివం గత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌ వర్ధంతిని గురువారం నిర్వ హించారు. సూర్యాపేటలోని రెడ్‌హౌజ్‌లో వైఎస్‌ఆర్‌  చిత్రపటానికి దామో దర్‌రెడ్డి నివాళులర్పించి మాట్లాడారు. 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం, రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర వైఎస్‌ఆర్‌కు ఉందన్నారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, కొప్పుల వేణారెడ్డి, తిరుమలప్రగఢ అనురాధకిషన్‌రావు, అ్డ పాల్గొన్నారు. అనంతగిరిలో కనగాల వీరయ్య, నడిగూడెంలో ఎంపీటీసీ గుండు రశ్రీనివాస్‌, తంగతుర్తి, తిరుమలగిరిల్లో పీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య,మునగాలలో కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా అధ్యక్షుడు బచ్చుఅశోక్‌ , నూతనకల్‌ బొడ్డుపల్లి అంజయ్య,  హుజూర్‌నగర్‌లో తన్నీరు మల్లికార్జున్‌రావు, సాముల శివారెడ్డి, యరగాని నాగన్న, నడిగూడెంలో ఎంపీటీసీ గుండుశ్రీనివాస్‌, గరిడేపల్లిలో వైయస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్య క్షుడు చందా గోపిరెడ్డి అన్నారు. కోదాడలో వంగవీటి రామారావు అన్నారు. మఠంపల్లిలో ఆదూరి కిషోర్‌రెడ్డి, ఎంఎం యాదవ్‌, చిలక గురవయ్య, సయ్యద్‌ కరీం, సూర్యాపేటలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌రమేష్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  






Updated Date - 2021-09-03T07:06:14+05:30 IST