రైతులు మరో పోరాటానికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2021-01-13T06:06:44+05:30 IST

రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మ రో పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.

రైతులు మరో పోరాటానికి సిద్ధం కావాలి
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

మాడ్గులపల్లి, జనవరి 12: రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మ రో పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో మంగళవారం చేపట్టిన రిలేనిరాహార దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత మాటమార్చి ప్రధాని మోదీకి వత్తాసు పలుకుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు రొండి శ్రీనివాస్‌, శ్రీకర్‌, అశోక్‌రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2021-01-13T06:06:44+05:30 IST