రైతుల కష్టం వర్షం పాలు

ABN , First Publish Date - 2021-05-20T06:39:39+05:30 IST

రైతు కష్టం వర్షం పాలవుతోంది. అకాల వర్షంతో ధాన్యం తడుస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతుల కష్టం వర్షం పాలు
Farmers milk hard rain

కొండమల్లేపల్లి, మే 19: రైతు కష్టం వర్షం పాలవుతోంది. అకాల వర్షంతో ధాన్యం తడుస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. బుధవారం కురిసిన అకాల వర్షానికి కొండమల్లేపల్లిలోని మార్కెట్‌ యార్డులో ఉన్న ధాన్యం తడిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీల ట్రాన్స్‌పోర్టు, గన్నీ బస్తాల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమను పట్టించుకోవడంలేదని ఆవేదన రైతులు ఆవేదన చెందుతున్నారు. ట్రాన్స్‌పోర్టు కొరతతో బస్తా లు కొనుగోలు కేంద్రంలో కాంటా చేసిన బస్తాలు నిలిచిపోతున్నా యని, వర్షాలతో మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం కుప్పలు తడిసి కింది నుంచి మొలకెత్తుతు న్నాయని తెలిపారు. మార్కెట్‌కు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్నా తేమ శాతం, గన్నీ బస్తాలు, ట్రాన్స్‌పోర్టు కొరత అని కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో త డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వర్షాలకు ధాన్యంపై కప్పే పట్టాలు నెల రోజుల నుంచి అద్దెకు తీసుకొచ్చి కప్పుతున్నామని రోజుకు వంద రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని చె బుతున్నారు. ఽధాన్యం ఎండబెట్టేందుకు, దగ్గరకు చేసేందుకు డొజర్ల కిరాయి, హమాలీలకు క్వింటాల్‌కు క్వాంట చేసినందుకు రూ.34లు అన్ని ఖర్చులు తమపైనే మోపుతున్నారని రైతులు తెలిపారు. సివిల్‌ సప్లయి కాంట్రాక్టర్‌, లారీల ట్రాన్స్‌పోర్టు, గన్నీబస్తాల కొరతలేకుండా చూడాలని, పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 

త్వరగా కాంటాలు వేయిస్తాం

మర్రిగూడ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కాంటాలు వేసేం దుకు చర్యలు తీసుకుంటామని శివన్నగూడ వ్యవసాయ రైతు పరపతి సంఘం సొసైటీ చైర్మన్‌ బాలం నర్సింహ తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలిం చారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన ప్రతి ధాన్యపు గిం జను కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం తాలులేకుండా, మ్యాచర్‌ ఉండే విధంగా ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బం ది మనోహర్‌, పాలకవర్గం సభ్యులు రవీందర్‌రెడ్డి, ముత్తయ్య, రావు ఉన్నారు.  ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు రవాణా చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌కు ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా కోరారు. మర్రిగూడ మండలంలో రెండు కొనుగోలు కేంద్రాలలో వేలాది టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిల్వ ఉందని, వాటిని రవాణా చేయకుండా మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నా రని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయాలు చేసేలా చూడాలని కోరారు. 

పూర్తిస్థాయి ధాన్యం కొనుగోలుకు చర్యలు

పెద్దఅడిశర్లపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని  ధాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా సహకార అధికారి ఎస్‌వీ ప్రసాద్‌ అన్నా రు. మండలకేంద్రంతో పాటు అంగడిపేటస్టేజీ, ఘనపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుదవారం పరిశీలించారు. తమకు లారీ లు రావటం లేదని, గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో  లేకపోవ డంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు విన్నవించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న లారీల, గన్నీ బ్యాగుల కొరత లే కుండా చర్యలు తీసుకుంటామని డీసీవో అన్నారు. ఆయన వెంట సీఈఓ వెంకటేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-20T06:39:39+05:30 IST