రైతుల ఆనందమే ప్రభుత్వ ధేయ్యం : రజాక్‌

ABN , First Publish Date - 2021-12-31T05:38:31+05:30 IST

రైతుల కళ్లలో ఆనందం చూడడం కోసమే సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ఎ.రజాక్‌ అన్నారు. మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో వివిధ గ్రామాల రైతు సమన్వయ సమితి అధ్యక్షు

రైతుల ఆనందమే ప్రభుత్వ ధేయ్యం : రజాక్‌
సమావేశంలో మాట్లాడుతున్న రజాక్‌

మద్దిరాల, డిసెంబరు 30: రైతుల కళ్లలో ఆనందం చూడడం కోసమే సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ఎ.రజాక్‌ అన్నారు. మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో వివిధ గ్రామాల రైతు సమన్వయ సమితి అధ్యక్షులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలోని లక్షా 43వేల 570 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.314కోట్లు జమ చేసిందన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, నాయకులు ఆకుల ఉప్పలయ్య, దుగ్యాల రవీందర్‌రావు, కన్న వీరన్న, ప్రతాప్‌, సాయిబాబు, వడ్డాణం మధు, లింగారెడ్డి, యాకయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:38:31+05:30 IST