నేడు కలెక్టరేట్‌ ఎదుట రైతు నిరసన దీక్ష

ABN , First Publish Date - 2021-11-22T05:14:48+05:30 IST

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

నేడు కలెక్టరేట్‌ ఎదుట రైతు నిరసన దీక్ష

 డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 

భువనగిరిరూరల్‌, నవంబరు 21: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరిలో ఆయన మా ట్లాడుతూ జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో 20 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో అకాలవర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌ ఎదుట ‘కర్షకుడా కదలిరా... ధాన్యం కొనేవరకు ఉద్యమిద్దాం’ అనే నినాదంతో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. 


Updated Date - 2021-11-22T05:14:48+05:30 IST