రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-02-05T05:52:04+05:30 IST

సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు.

రైతు పక్షపాతి  సీఎం కేసీఆర్‌
నల్లగొండ రూరల్‌ : రైతు సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

కనగల్‌ / నల్లగొండ రూరల్‌, ఫిబ్రవరి 4 : సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కనగల్‌ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తూ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతు వేదికలు రైతులకు సలహాలు అందించే కేంద్రాలుగా ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ రైతుబంధు సమితి క్యాలెండర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ వెంకటేశంగౌడ్‌, వైస్‌ఎంపీపీ శ్రీధర్‌రావ్‌, సింగిల్‌ విండో చైర్మన్లు సహదేవరెడ్డి, శ్రీను, మందడి రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్లగొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో ఏర్పా టు చేసిన రైతు వేదికను ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల కోసం పంట సాగు చేసిన దగ్గరి నుంచి విక్రయించే వరకు అనేక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో జేడీఏ శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ సుధారాణి, ఏవో సుమన్‌రామన్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-05T05:52:04+05:30 IST