సాధించుకున్న తెలంగాణ ప్రగతి భవన్‌లో బందీ

ABN , First Publish Date - 2021-02-05T05:43:39+05:30 IST

ఆత్మ బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రగతి భవన్‌లో బంది అయ్యిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు విమర్శించారు.

సాధించుకున్న తెలంగాణ ప్రగతి భవన్‌లో బందీ
జెండా ఆవిష్కరిస్తున్న పీవీ శ్యాంసుందర్‌రావు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు 

బీబీనగర్‌, ఫిబ్రవరి 4: ఆత్మ బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రగతి భవన్‌లో బంది అయ్యిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు విమర్శించారు. మండలంలోని రావిపహడ్‌ గ్రా మంలో వందమంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి గు రు వారం బీజేపీలో చేరారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే సత్తా బీజేపీకి ఉందన్నారు. కలలు కన్న తెల ంగాణ రాష్ట్రం ప్రగతి భవన్‌ టూ ఫాం హౌస్‌గా మారిందన్నారు. నాటి నిజాం గడీల పాలనను తలపిస్తున్న కేసీఆర్‌కు  రాష్ట్ర ప్రజలు చర మగీతం పాడే రోజులు ఎంతో దూరంలో లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్‌, పాశం భాస్కర్‌,  దాసరి మల్లేశం, నర్ల నర్సింగ్‌రావు, ఏలూరి శ్యాం పొట్టనవీన్‌, జంగా రెడ్డి, అశోక్‌, సుదర్శన్‌, నాగరాజు, మల్లేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-05T05:43:39+05:30 IST