ఉత్కంఠభరితంగా ఎడ్ల పందేలు

ABN , First Publish Date - 2021-03-16T06:14:44+05:30 IST

మహాశివరాత్రి సందర్భం గా మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వా మి దేవాలయం వద్ద రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు సో మవారం ఉత్కంఠగా కొనసాగాయి.

ఉత్కంఠభరితంగా ఎడ్ల పందేలు
ఎద్దుల పందెం పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మేళ్లచెర్వు, మార్చి 15: మహాశివరాత్రి సందర్భం గా మేళ్లచెర్వులోని శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వా మి దేవాలయం వద్ద రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు సో మవారం ఉత్కంఠగా కొనసాగాయి. ఎద్దులు బండలాగు తూ పరుగెత్తుతుండగా తిలకించే ప్రజల్లో ఉత్సాహం పెరిగి ఆనందం వెల్లివిరిసింది. ఈ పోటీలను చూసేందుకు వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. న్యూ కేటగిరి, సబ్‌ జూనియర్స్‌ సైజుల విభాగాల్లో పోటీలు జరిగాయి. పోటీ ల్లో జిల్లాతో పాటు గుం టూరు, ప్రకాశం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. న్యూ కేటగిరి సైజు విభాగం ఎడ్ల పందెం పోటీల్లో తోట్టంపూడి బ్రదర్స్‌ (రామనగరం, సూర్యాపేట)కు చెందిన ఎద్దులు 3500 అడుగులు లాగి ఏడవ బహుమతి గెలుపొందాయి.  

ముగిసిన కబడ్డీ ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ పోటీలు

మండలకేంద్రంలో ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో ని ర్వహించిన కబడ్డీ ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ పోటీలు ఆ దివారం ముగిశాయి. పోటీల్లో విజయవాడ జట్టు ప్ర థమ బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి వై జాగ్‌, మూడవ బహుమతి సూర్యాపేట, నాలుగు మే డ్చల్‌, ఐదు భద్రాది కొత్తగూడెం, ఆరవ బహుమతి ఖ మ్మం జట్టు గెలుపొందింది. విజేతలకు  మైహోం ఇం డస్ర్టీస్‌ జేపీ శ్రీనివాసరావు, కృషి ఫౌండేషన్‌ పోశం వెంకట్‌రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మైహోం డీజీఎం పార్ధసారథి, ఫ్రెండ్స్‌ యూత్‌ అధ్యక్షుడు సాముల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ సవయ్య, ఉపాధ్యక్షుడు బాలస్వామి, కార్యదర్శి జె.అశో క్‌, శ్రీకాంత్‌, ఇమ్రాన్‌ పాల్గొన్నారు. 

సీనియర్‌ సైజు ఎద్దుల పందేలు ప్రారంభం  

ఎద్దుల పందేల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ర్టాల స్థాయి సీనియర్‌ సైజు ఎ ద్దుల పందెం పోటీలను ఎమ్మెల్యే సైదిరెడ్డి సోమవా రం రాత్రి  ప్రారంభించారు. ఆయన్ను పందేల నిర్వాహకుడు బోగాల కొండారెడ్డి  శాలువాతో ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు గుండా బ్రహ్మారెడ్డి, సర్పంచ్‌ శంకర్‌రెడ్డి, జడ్పీ కోఆఫ్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌, బాలవెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Updated Date - 2021-03-16T06:14:44+05:30 IST