దేవరకొండ నియోజకవర్గంలో ఎక్సైజ్‌ దాడులు

ABN , First Publish Date - 2021-10-29T06:32:17+05:30 IST

దేవరకొండ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ఈనెల 26 నుంచి 28 వరకు విస్తృతంగా దాడులు నిర్వహించి, నాటుసారా విక్రయాలు జరుపుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

దేవరకొండ నియోజకవర్గంలో ఎక్సైజ్‌ దాడులు

  30 లీటర్ల నాటుసారా స్వాధీనం 

దేవరకొండ, అక్టోబరు  28:  దేవరకొండ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో ఈనెల 26 నుంచి 28 వరకు విస్తృతంగా దాడులు నిర్వహించి, నాటుసారా విక్రయాలు జరుపుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని గిరిజన తండాలలో నాటుసారా స్థావరాలపై విసృతంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. నాటుసారా విక్రయాలు జరుపుతున్న నేనావత్‌ నరేష్‌, లక్‌పతిలను అరెస్ట్‌ చేసి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈదాడుల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐలు సూర్యప్రకాష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T06:32:17+05:30 IST