కరోనా కట్టడిలో అందరూ భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-05-08T07:29:27+05:30 IST

కరోనా కట్టడిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావు అన్నారు.

కరోనా కట్టడిలో అందరూ భాగస్వాములు కావాలి
భువనగిరిలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావు 

 భువనగిరి టౌన్‌, మే 7: కరోనా కట్టడిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సాంబశివరావు అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో భువనగిరిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అవగాహన లోపంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లాలో కరోనా నియంత్రణకు వైద్యారోగ్య శాఖ పలు చర్యలు చేపడుతుందన్నారు. కరోనా బాధితుల కోసం సీపీఎం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌ మాట్లాడుతూ భువనగిరిలో ఏర్పాటు చేసిన హైల్ప్‌లైన్‌లో నిరంతరం ఐదుగురితో కూడిన బృందం అందుబా టులో ఉంటుందని త్వరలోనే 1700కేంద్రాల్లో, సీపీఎం బలంగా ఉన్న 30గ్రామాల్లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా బాధితులు భువనగిరి హెల్ప్‌లైన్‌ నెంబర్లు 9573782179, 9490098344, 9912438221, 9848410381, 9848094327కు సంప్రదించి సేవలు పొందాలన్నారు. కార్యక్రమంలో హెల్ప్‌లైన్‌ కేంద్రం సభ్యులు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, భట్టుపల్లి అనురాధ, సిర్పంగి స్వామి, నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T07:29:27+05:30 IST