అందరికీ న్యాయ సేవలు అందాలి : జిల్లా న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-10-21T06:00:01+05:30 IST

గ్రామీణ ప్రాంతా ల్లో నివసించే ప్రజలందరికీ న్యాయ సేవ అందాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ. రమేష్‌ అన్నారు. పాన్‌ ఇండియా లీగల్‌ సర్వీసెస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా నల్లగొండ కో

అందరికీ న్యాయ సేవలు అందాలి : జిల్లా న్యాయమూర్తి
ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న జిల్లా ప్రధాన జడ్జి రమేష్‌

నల్లగొండ క్రైం/ తిప్పర్తి, అక్టోబరు 20: గ్రామీణ ప్రాంతా ల్లో నివసించే ప్రజలందరికీ న్యాయ సేవ అందాలని ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ. రమేష్‌ అన్నారు. పాన్‌ ఇండియా లీగల్‌ సర్వీసెస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా నల్లగొండ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల ఎగ్జిబిషన్‌ను బుధవారం ప్రారంభించారు. న్యా యసేవ అవగాహన కార్యక్రమాలు నిర్వహించే వరకు కోర్టు ఆవరణలో ఎగ్జిబి షన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవా సంస్థ కార్య దర్శి వేణు, జిల్లా అదనపు న్యాయమూర్తులు విష్ణుమూర్తి, భవాని, సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వర, మేడ మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. తిప్పర్తిలో జరిగిన  చట్టాలపై అవగాహన సదస్సులో డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ జి.వేణు మాట్లాడారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, ప్యానల్‌ లాయర్‌ ఎన్‌. భీమార్జున్‌రెడ్డి, ఎస్‌.ఐ సత్యనారాయణ, సర్పంచ్‌ రొట్టెల రమేష్‌, కందుల రేణుక, ఏఎస్‌ఐ మట్టయ్య, జాకటి మోష పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:00:01+05:30 IST