ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి
ABN , First Publish Date - 2021-05-05T06:14:48+05:30 IST
తోటివారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు.

డీసీపీ నారాయణరెడ్డి
భువనగిరి టౌన్, మే 4: తోటివారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. భువనగిరిలో పట్టణ పోలీసులు, రెడ్‌క్రాస్ సంస్థ సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో రక్తనిల్వలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా సకాలంలో రక్తం అందక పలువురు మృత్యువాతపడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ యాదాద్రి జోన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అలాగే బుధవారం యాదగిరిగుట్టలో, గురువారం చౌటుప్పల్‌లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 93 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భుజంగరావు, ఏసీపీ శ్రీనివాసరావు, పట్టణ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, రెడ్‌క్రాస్ ప్రతినిధి దిడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.