ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-15T07:07:12+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేం దుకు ప్రభుత్వం అందిస్తున్న సురక్షితమైన వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరూ వేయించుకోవాలని డక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిసి ్టట్యూట్‌(డాక్రీ) డైరెక్టర్‌ కుర్రా జితేంద్రబాబు అన్నారు.

ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
నడిగూడెంలో డాక్రీ డైరెక్టర్‌ జితేంద్రబాబుకు వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

నడిగూడెం, డిసెంబరు 14: కరోనా మహమ్మారి నుంచి  కాపాడుకునేం దుకు ప్రభుత్వం అందిస్తున్న సురక్షితమైన వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరూ వేయించుకోవాలని డక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇనిసి ్టట్యూట్‌(డాక్రీ) డైరెక్టర్‌ కుర్రా జితేంద్రబాబు అన్నారు. వైద్య సిబ్బంది చేప ట్టిన ఇంటింటికీ టీకా కార్యక్రమంలో భాగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను మంగళ వారం ఆయన వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూరు శాతం వ్యాక్సినేషన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. నడిగూ డెం, వల్లపురంలో మొదటి, రెండో డోస్‌ టీకాలను వైద్య సిబ్బంది వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో లింగారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T07:07:12+05:30 IST