చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-10-28T05:47:41+05:30 IST

చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ఎన్‌ మూర్తి అన్నారు.

చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి

చింతలపాలెం/ నూతనకల్‌ / తుంగతుర్తి, అక్టోబరు 27 : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని హుజూర్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ఎన్‌ మూర్తి అన్నారు. మండలకేంద్రంలోని హైస్కూల్‌లో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో  హుజుర్‌నగర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సాకేత్‌ మిత్ర, తహసీల్దార్‌ సచిన్‌ తివారి, అంజనేయులు, గ్యామనాయక్‌, అమీర్‌పాబ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా నూతనకల్‌ మండల కేంద్రంలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో జిల్లా జడ్జి వేణు పాల్గొన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌, సర్పంచ్‌ తీగల కరుణశ్రీగిరిధర్‌రెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు దామెర శ్రీనివాస్‌, న్యాయవాదులు ఉన్నారు. అదేవిధంగా తుంగతుర్తి మండలం కర్విరాలకొత్తగూడెం గ్రామంలో న్యాయసేవా సదస్సు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ  అవగాహన పెంచుకోవాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌ అన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం, సర్పంచ్‌ నకెరకంటి విజయ్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T05:47:41+05:30 IST