అన్ని మతాలకు సమప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-12-25T06:34:43+05:30 IST

అన్ని మతాలకు ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోంద ని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక జీసెస్‌ సాల్వేషన్‌ మినిస్ట్రీ్‌సలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీచేశారు.

అన్ని మతాలకు సమప్రాధాన్యం
పేద మహిళలకు క్రిస్మస్‌ చీరలను పంపిణీ చేస్తున్న బండా నరేందర్‌రెడ్డి

నార్కట్‌పల్లి, డిసెంబరు 24: అన్ని మతాలకు ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోంద ని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక జీసెస్‌ సాల్వేషన్‌ మినిస్ట్రీ్‌సలో శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారిపై దాడులు కూడా నిలిచాయన్నారు. క్రీస్తు జననం విశ్వానికి ఓ దారి చూపిందని, ఆ మార్గంలో అంతా నడవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు దూదిమెట్ల స్రవంతి, గోసుల భద్రాచలం, దాసరి రాజు, సామ నరేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ పల్నాటి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో యాదగిరి, పాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌, అబ్రహం, పాల్గొన్నారు.

Updated Date - 2021-12-25T06:34:43+05:30 IST