చేపల పెంపకంతో యువతకు ఉపాధి

ABN , First Publish Date - 2021-12-28T05:41:52+05:30 IST

చేపల పెంపకం వృత్తి నైపుణ్య శిక్షణతో యువత స్వయం ఉపాధిని పొందవచ్చని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

చేపల పెంపకంతో యువతకు ఉపాధి
మాట్లాడుతున్న ఎంపీపీ సుజాతాశ్రీనివాస్‌గౌడ్‌

గరిడేపల్లి రూరల్‌, డిసెంబరు 27: చేపల పెంపకం వృత్తి నైపుణ్య శిక్షణతో యువత స్వయం ఉపాధిని పొందవచ్చని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో చేపల పెంపకంపై సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చేపల పెంపకం, మార్కెటింగ్‌ తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం ఇన్‌చార్జి బి.లవకు మార్‌, శాస్త్రవేత్తలు నరేష్‌, కిరణ్‌, డి.నరేష్‌, మాధురి, ఆదర్శ్‌, శిక్షణ పొందుతున్న యువత శైలజ, స్రవంతి, మట్టయ్య, అంబేడ్కర్‌, రాంబాబు పాల్గొన్నా రు.  


Updated Date - 2021-12-28T05:41:52+05:30 IST