నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-07-08T05:56:10+05:30 IST
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.

అర్వపల్లి, జూలై 7: నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. పర్సాయపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బానోత్ బుడ్లాను, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన అంకిరెడ్డి రవి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. రవి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల ఉరేందర్‌రెడ్డి, వ్యవసాయ మండల కోఆర్డినేటర్ ఎర్ర నర్సయ్య, సర్పంచ్ పుప్పాల శేఖర్, ఎంపీటీసీ గీతసురేష్, యుగేందర్, బొడ్డు రామలింగయ్య, బైరబోయిన రామలింగయ్య, వెంకన్న, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.