ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-30T06:46:23+05:30 IST

ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బీక్యాతండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, యూనిఫాంపంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమ నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.

ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే
బీక్యా తండాలో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

కోదాడ రూరల్‌, డిసెంబరు 29: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం మండలంలోని బీక్యాతండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, యూనిఫాంపంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే సామాజిక  మార్పు  సాధ్యమ నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత, యూనిఫాం, నోట్‌ పుస్తకాల దాత సైదానాయక్‌, సర్పంచ్‌ అంబేడ్కర్‌, ఎంఈవో సలీంషరీఫ్‌, సొసైటీ చైర్మన్‌ నలజాల శ్రీని వాసరావు, ఉపేందర్‌, ఇమ్రాన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
Updated Date - 2021-12-30T06:46:23+05:30 IST