వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-02-01T06:11:30+05:30 IST

రాష్ట్రంలో వీఆర్వోలు ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటి పరిష్కారాని కి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

 ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నల్లగొండ టౌన్‌, జనవరి 31 :
రాష్ట్రంలో వీఆర్వోలు  ఎదుర్కొంటున్న సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటి పరిష్కారాని కి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. టీవీఆర్వోల  సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీఎన్‌జీవో్‌స భవన్‌లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వీ ఆర్వోలవి న్యాయమైన కోర్కెలని, వాటిని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అక్కడక్కడ కొందరు తహసీల్దార్లు వీఆర్వోలను ఇబ్బందుల కు గురిచేస్తున్నారన్న విషయం తన దృష్టికి రాగా సీఎ్‌సతో మాట్లాడినట్లు తెలిపారు. వీఆర్వో లు అదేశాఖలో కొనసాగించాలని కోరుకునేవాడి లో తాను ఒకడినన్నారు. ఆరేళ్లుగా తాను అన్ని సంఘాలతో పనిచేసి వారి సమస్యల పరిష్కారంలో ముందు వరసలో ఉన్నానన్నారు. త్వర లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీఆర్వోలందరూ తనకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కో రారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడు తూ వీఆర్వోలకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టూ వారి సమస్యల పరిష్కారంలో ముందుంటానన్నారు. సంఘం రాష్ట్ర అద్యక్షుడు గోల్కండ సతీష్‌ మాట్లాడుతూ పీఆర్‌సీలో వీఆర్వోలందరికీ సీనియర్‌ అసిస్టెంట్‌ స్కేల్‌ అమలు చేయాలని కోరారు. రెవెన్యూ శాఖలోనే వీఆర్వోలను సర్దుబా టు చేయాలన్నారు.
అప్పటివరకు భూసంబంధిత పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అనంతరం సభ లో తీర్మానించిన తీర్మాన పత్రాలను ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డికి అందించారు. సంఘం జిల్లా అద్యక్షుడు పగిళ్ల వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించి న  సమావేశంలో టీఎన్‌జీవో్‌స జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, వీఆర్వోల సంఘం యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య, రమేష్‌, సంజీవ, శాస్ర్తి, శ్రీనివాసులు, రమేష్‌, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.నజీర్‌, శ్రీనివాసులు, శ్రీదేవి, జెల్ల వెంకటేష్‌, రంగరాజు శ్రీనివాసులు పాల్గొన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జహంగీర్‌ అలీ, జిల్లా అధ్యక్షుడు పంతులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు సయ్యద్‌ అన్వర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-01T06:11:30+05:30 IST