టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-10-20T06:32:43+05:30 IST

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషిచేయాలి
సూర్యాపేటలో సత్యనారాయణను సన్మానిస్తున్న నాయకులు

సూర్యాపేటటౌన్‌/ మఠంపల్లి/ కోదాడటౌన్‌/ నడిగూడెం/ అనంత గిరి, అక్టోబరు 19 : టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులుగౌడ్‌ అన్నారు. నూతనంగా ఎన్నికైన వారిని పట్టణ టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పల లలితాదేవిఆనంద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, ఆకుల కవితలవకుశ, నాయకులు వై. వెంకటేశ్వర్లు, రఫి, పెద్దిరెడ్డి రాజా, పోలెబోయిన నర్సయ్యయాదవ్‌, కోడి సైదులుయాదవ్‌, గుడిపూడి వెంకటేశ్వర్లు, గండూరి కృపాకర్‌, బైరు వెంకన్నగౌడ్‌, ఆయూబ్‌ఖాన్‌, గుర్రం సత్యనారాయణ, చల్లా లక్ష్మీకాంత్‌, రాచర్ల కమలాకర్‌ పాల్గొన్నారు. మఠంపల్లి మండలంలోని వర్ధాపురంలో జరిగిన ముఖ్యకార్య కర్తల సమావేశంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఇరుగు పిచ్చ య్య, అశోక్‌నాయక్‌ మాట్లాడారు. సమావేశంలో నాయకులు వెంకటరెడ్డి, బేతి శివారెడ్డి, పల్లె మట్టయ్య, సైదయ్య, వెంకటేశ్వర్లు, శంకరయ్య, కృష్ణయ్య, వీరబాబు పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని 19, 31వ వార్డులతో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు సీహెచ్‌ నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో గుండెల సూర్యానారాయణ, వెంకటనారాయణ, పోటు రంగరావు, శ్రీలత, మౌలానా, రోజారమణి పాల్గొన్నారు. నడిగూడెం శ్రీరంగాపురంలో నిర్వహించిన సమావేశంలో మండల అనుబంధ కమిటీలతో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, జడ్పీటీసీ బానాల కవితానాగరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు కొల్లు రామారావు, రాజేష్‌, పాలడుగు ప్రసాద్‌, గార్లపాటిశ్రీనివా్‌సరెడ్డి, ఆనంతు అంజానేయులగౌడ్‌, కాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతగిరి మండల పరిధిలోని మొగలాయికోటలో నిర్వహించిన గ్రామశాఖ సమావేశంలో టీఆర్‌ఎస్‌ కోదాడ నియోజకవర్గ సమన్వయ సభ్యుడు బుర్రా పుల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గింజుపల్లి రమేష్‌, మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాన్నారు. కార్యక్రమంలో నాయకులు బుర్రా నర్సింహ్మారెడ్డి, మట్టపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, లింగరాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మాల వెంకటప్పయ్య, మోజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:32:43+05:30 IST