మహిళా సమస్యల పరిష్కారం కోసం కృషి
ABN , First Publish Date - 2021-08-25T07:01:37+05:30 IST
రభారతి మ్యాక్స్ సంస్థ 22 సంవత్సరాలుగా మహిళా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షురాలు జిట్ట మంగమ్మ అన్నారు.

స్వరభారతి మ్యాక్స్ అధ్యక్షురాలు జిట్ట మంగమ్మ
తుర్కపల్లి, ఆగస్టు 24: స్వరభారతి మ్యాక్స్ సంస్థ 22 సంవత్సరాలుగా మహిళా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షురాలు జిట్ట మంగమ్మ అన్నారు. మండల కేంద్రంలోని స్వరభారతి మ్యాక్స్ 22వ వార్షికోత్సవాన్ని స్థానిక పిలుపు సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో ఆమె మాట్లాడారు. 22 సంవత్సరాలుగా తుర్కపల్లి, భువనగిరి మండలాల్లోని 15గ్రామాల్లో 183 సంఘాల్లో 2301 మంది సభ్యులతో స్వరభారతి మ్యాక్స్ పనిచేస్తోందన్నారు. అంతేకాకుండా సుస్థిర వ్యవ సాయసాగు పద్ధతులు, చిరుధాన్యాల సాగు, మహిళా సమస్యలపై జిల్లా, రాష్ట్రస్థాయిలో పనిచేస్తుందన్నారు. సమావేశంలో 2020–21 సంవ త్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు సంబంధించి సభ్యుల పొదుపులు, పొదుపులపై వచ్చిన వడ్డీ వివరాలను సభ్యులకు చదివి వినిపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక తరపున కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. సమావేశంలో స్వరభారతి మ్యాక్స్ మేనే జర్ లక్ష్మి, పిలుపు సంస్థ కోఆర్డినేటర్లు గోవర్దన్, మహిపాల్, స్వర భారతి మ్యాక్స్ బోర్డు డైరక్టర్లు పాల్గొన్నారు.