మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2021-01-12T06:05:27+05:30 IST

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అన్నారు.

మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్సీ
తేరా చిన్నపరెడ్డికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

హాలియా, జనవరి 11 : మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అన్నారు. మునిసిపాలిటీలో  సోమవారం నిర్వహించిన జనరల్‌బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలపై నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి నివేదించి నిధులు తెచ్చి మునిసిపాలిటీ అభివృద్ధికి దోహదపడతానన్నారు. అంతకుముందు తహసీల్దార్‌ మంగ, కమిషనర్‌ వేమనరెడ్డి ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం మున్సిపాలిటీ ఆటోలను ప్రారంభించారు. అదేవిధంగా ఐదో వార్డులో పబ్లిక్‌ కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రోహిత్‌శర్మ, చైర్మన్‌ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ చింతల చంద్రారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-12T06:05:27+05:30 IST