మండల సమగ్రాభివృద్ధికి కృషి : చిన్నపరెడ్డి

ABN , First Publish Date - 2021-02-05T05:51:04+05:30 IST

అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి మండల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కోరారు.

మండల సమగ్రాభివృద్ధికి కృషి : చిన్నపరెడ్డి
పెద్దవూర : మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి

పెద్దవూర, ఫిబ్రవరి 4 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి మండల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని శాఖల అధికారుల పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిఽధులు సైతం ప్రశ్నించే విధానాన్ని నేర్చుకున్నప్పుడే గ్రామాల్లో సమస్యలు సత్వరమే తీరుతాయన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డులు అం దుకున్న పర్వేదుల, బట్టుగూడెం, జయరాంతండా సర్పంచ్‌లు, అఽధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎంపీపీ చెన్ను అనురాధ అధ్యక్షతన కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీడీవో దుబ్బ శ్యాం, సర్పంచ్‌లు దండ మనోహర్‌రెడ్డి, లింగారెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు బషీర్‌ తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు : ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసిందన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు చేస్తూ రైతుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పాటు పడుతున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఆసరా పింఛన్ల మంజూరుకు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకన్నయాదవ్‌, ఎంపీడీవో సుధాకర్‌, తహసీల్దార్‌ ఆంజనేయులు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-05T05:51:04+05:30 IST