నేడు తెరుచుకోనున్న విద్యాసంస్థలు

ABN , First Publish Date - 2021-02-01T06:12:17+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో సుమారు 11 నెలల పాటు మూతపడిన విద్యాసంస్థలు సోమవారం ప్రారంభంకానున్నా యి.9,10వ తరగతి, ఉన్నత తరగతుల విద్యా ర్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధించేందుకు అన్ని విద్యాసంస్థలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఇప్పటికే శానిటైజ్‌ చేయగా, విద్యార్థుల సీటింగ్‌ ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాటు చేశారు.

నేడు తెరుచుకోనున్న విద్యాసంస్థలు
పునఃప్రారంభానికి సిద్ధమైన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల

నల్లగొండ క్రైం, భువనగిరి టౌన్‌, సూర్యా పేట అర్బన్‌, జనవరి 31: కరోనా వైరస్‌ నేపథ్యంలో సుమారు 11 నెలల పాటు మూతపడిన విద్యాసంస్థలు సోమవారం ప్రారంభంకానున్నా యి.9,10వ తరగతి, ఉన్నత తరగతుల విద్యా ర్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాఠాలు బోధించేందుకు అన్ని విద్యాసంస్థలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఇప్పటికే శానిటైజ్‌ చేయగా, విద్యార్థుల సీటింగ్‌ ఆరు అడుగుల దూరం ఉండేలా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మాస్కులతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. కాగా, పాఠశాలలు, కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు తల్లిదండ్రుల అంగీకారపత్రం తప్పనిసరిచేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులే అంగీకార పత్రాలు అందజేశారు. పాఠశాలలు, కళాశాలలకు విద్యార్థులు హాజరయ్యేలా ఒత్తిడి తేవద్దని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

Updated Date - 2021-02-01T06:12:17+05:30 IST