విద్య, వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలి

ABN , First Publish Date - 2021-12-07T07:06:49+05:30 IST

విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్‌ అన్నారు.

విద్య, వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలి

 - టీపీఎ్‌సవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్‌

నల్లగొండ క్రైం, డిసెంబరు 6 : విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్‌ అన్నారు. పట్టణంలోని యూటీఎఫ్‌ భవనంలో అంజిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. నూతనంగా పాఠశాల్లో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యా వలంటీలర్లను నియమించి పారిశుధ్య కార్మికులను సైతం కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీ చేసి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నమ్మకం కల్పించే విధంగా వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి వాణిశ్రీ, కార్యదర్శులు రమణారెడ్డి, మోత్కూరి శ్రీనివాస్‌, నాయకులు పద్మావతి, వెంకట్‌రెడ్డి, భిక్షమయ్య, నర్సిరెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం ఉన్నారు. 

Updated Date - 2021-12-07T07:06:49+05:30 IST