నేటి నుంచి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-07T06:44:34+05:30 IST

కనకదుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్స వాలు గురువారంనుంచి ప్రారంభంకానున్నాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు జిల్లా వ్యాప్తంగా మండపాలను సిద్ధంచేశారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి దేదీప్యమానంగా పూజిస్తారు. ప్రతి ఏడాది ఆశ్వ యుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ

నేటి నుంచి దుర్గాదేవి నవరాత్రోత్సవాలు
జిల్లా కేంద్రంలో ముస్తాబైన మండపం

సూర్యాపేట కల్చరల్‌, అక్టోబరు 6: కనకదుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్స వాలు గురువారంనుంచి ప్రారంభంకానున్నాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు జిల్లా వ్యాప్తంగా మండపాలను సిద్ధంచేశారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి దేదీప్యమానంగా పూజిస్తారు. ప్రతి ఏడాది ఆశ్వ యుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు పూజిస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున రాజరాజేశ్వరిదేవిగా అలంకరించి విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కనకదుర్గాదేవి వెలిసిన రోజు నుంచి మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. జిల్లాకేంద్రంలో మండపాల ను అందంగా తీర్చిదిద్ది, రంగురంగుల విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనున్నారు.  

Updated Date - 2021-10-07T06:44:34+05:30 IST