డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఎంపికకు నేడు డ్రా

ABN , First Publish Date - 2021-12-31T16:01:54+05:30 IST

మండలంలోని ఆర్లెగూడెంలో గ్రామపంచాయతీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భాగంగా అర్హులను గుర్తించేందుకు ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ఎంపికకు నేడు డ్రా

చిలుకూరు, డిసెంబరు 30: మండలంలోని ఆర్లెగూడెంలో గ్రామపంచాయతీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భాగంగా అర్హులను గుర్తించేందుకు ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం డ్రా తీస్తున్నట్లు తహసీల్దార్‌ రాజేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన 20ఇళ్ల కోసం గ్రామసభ ద్వారా అర్హులను గుర్తించనున్నట్లు తెలిపారు. అర్హుల జాబితా నుంచి లాటరీ పద్ధతి ద్వారా 20మందిని ఎంపిక చేసి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. జాబితాలో ఉన్న అర్హులు ఉదయం 10 గంటల వరకు కోదాడలోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకోవాలని కోరారు. 

Updated Date - 2021-12-31T16:01:54+05:30 IST